సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం
నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారంఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సంప్రదింపులు,సలహాల సదస్సు కు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేపట్టిన కులగణన తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని నీలం మధు స్పష్టం చేశారు. ఈ కులగణన తో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగడంతో పాటు వెనుకబడిన తరగతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే తోడ్పడుతుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ , ప్రజా ప్రతినిధులందరికీ బీసీ వర్గాల పక్షాన నీలం మధు ధన్యవాదాలు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…