Telangana

ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోండి…

– విద్యార్థులకు జిల్లా పరిషత్ హెస్ట్కూల్ హెడ్ మాస్టర్ రమాదేవి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులంతా ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలని, ఆ లక్షణం ఉన్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రమాదేవి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ సైన్స్ దినోత్సవం’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణలకు బాటలు వేసిందని, శాస్త్రీయ ఫలాలు సామాన్య మానవుల శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఆహారం, శక్తి కొరతను మానవాళి ఎదుర్కోబోతోందని, వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొనాలని భావి శాస్త్రవేత్తలకు ఆమె సూచించారు.

తొలుత, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష అధ్యక్షోపన్యాసం చేయగా, రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీవీ నాగేంద్ర కుమార్ వందన సమర్పణ చేశారు. గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి తదితరులు శాస్త్రీయంగా మానవాళికి ఇతోధిక సేవలందించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడంతో పాటు తమ పాఠశాల రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తృణ ధాన్యాలపై రూపొందించిన వార్షిక ఈ-పత్రికను ఆవిష్కరించారు.

ఆ తరువాత రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన శాస్త్రీయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పలు మోడళ్ళు ఎలా పనిచేస్తున్నాయో, వాటి వెనుక ఉన్న సెన్స్డ్ ఏమిటి అనే అంశాలను విద్యార్థులు అడిగి తెలుసుకోవడం ముచ్చటేసింది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago