పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.కొమురం భీం జయంతి సందర్భంగా చిట్కుల్ లోని క్యాంపు కార్యాలయంలో కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ,దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వారితో విరోచితంగా పోరాడినటువంటి పోరాట యోధుడు కొమరం భీమ్ అన్నారు.ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి అణగారిన వర్గాలకు ఆత్మబంధువుగా మారాడని తెలిపారు.అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై నిజాం సర్కార్ పాశవిక చర్యలకు పాల్పడిన సందర్భంలో ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది ఆదివాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు.ఆ మహావీరుడు పోరాట స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వి నారాయణరెడ్డి,మురళీ,గోపాల్,ఉళ్ళ శంకర్,మన్నేరాఘవేంద్ర, కంజార్ల రవి,విష్ణువర్థన్, ప్యట గోపాల్,సోములు,మల్లేశం,మనోహర్,మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…