Telangana

ఉత్తమ విద్యకు చిరునామ ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థలు

– ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థలు ఉత్తమ విద్యకు చిరునామ గా నిలుస్తున్నాయని ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని పేర్కొన్నారు.గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ఆర్కే నగర్ లో మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ని చైర్మన్ రాజు సంఘాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ లోగోతో టి షర్ట్స్ ధరించి కాలనీలలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి స్కూల్ కు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు సంఘాని మాట్లాడు తు విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యను అందిస్తూ 50 బ్రాంచీలకు పైగా ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ నడుపుతున్నామని చెప్పారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో సీబీఎస్సీ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి కోర్సులను కొనసాగించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చదువులో మెలుకువలు నేర్పుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి చదువును అందజేస్తున్నామన్నారు. రోజువారీగా విద్యార్థులకు చదువు డెవలప్ కావడానికి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామని సూచించారు.

చదువుతోపాటు లైఫ్ స్కిల్స్ అందిస్తున్నట్లు చెప్పారు.మంచి గ్రామర్ తో ఇంగ్లీష్ లో సీఎల్డీపి ప్రోగ్రాం చేపడతామని చెప్పారు.6 నుండి 10 వరకు విద్యార్థులకు ఐఐటి, మెడికల్ ఎంట్రన్స్ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుందని తెలిపారు. సెంట్రల్ కార్యాలయం నుంచి టీచర్లకు ఎప్పటికప్పుడు పలు సూచనలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇన్చార్జి డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పటాన్ చెరు పారిశ్రామిక వాడలో సామాన్య మధ్యతరగతి పిల్లలే ఉంటారని మరి ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ప్రత్యేక కృషి జరుగుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామకృష్ణ. ప్రధానోపాధ్యాయురాలు దీప.దీప. వివిధ బ్రాంచీల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

4 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

4 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago