Telangana

ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి, రామచంద్రాపురం :

అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేయించుకునేలా మరింత అవగాహన కల్పించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భారతీ నగర్, రామచంద్రపురం డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నప్పటికిని.. నమోదు శాతం ఆశించినంతగా లేదని తెలిపారు. ప్రక్రియ ముగియడానికి ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్ లో పాల్గొనని ఓటర్లను స్వయంగా కలుసుకొని వివరాలు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, పృథ్వీరాజ్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

21 minutes ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

6 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

18 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

18 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

19 hours ago

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…

19 hours ago