_గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..
_జాతీయ రహదారిపై వంటావార్పు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 150 శాతం గ్యాస్ ధరలను పెంచిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. కార్పోరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేదల పాలిట పెనుభూతంగా మారిందని దుయ్యబట్టారు. చమురు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ప్రజలు చివరకు మళ్లీ కట్టెల పొయ్యి పై వంటలు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రధాని మోడీని గద్దె దించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…