పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సమానత్వానికి దోహదం చేశాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ ద్విచక్ర వాహనాల ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఒక్కరి పట్ల ప్రేమ, అనురాగం ఆప్యాయతో మెలగాలని క్రీస్తు తన బోధనల ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. క్రిస్టియన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో నూతన చర్చిల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…