Telangana

చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన విచారణ జరిపించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో 113 సర్వే నెంబర్ల రైతులందరికి నష్టపరిహారం చెల్లించాలి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

చిన్న కంజర్ల భూభాగోతంపైన సమగ్రమైన విచారణ జరిపించి,అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న చిన్న కంజర్ల గ్రామ జిపిఓ బండారి రాజును తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు మండలంలోని చిన్నకంజర్ల గ్రామంలో సర్వేనెంబర్ 113 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు పేరుతో గ్రామంలోని రైతుల ద్వారా 185 ఎకరాలను తీసుకుంటుందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం గ్రామసభ నిర్వహించినప్పుడు రైతులకు 28 లక్షల తోపాటు ప్రతి కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రస్తుతం రెండు దఫాలుగా 75 ఎకరాలు, మరో 50 ఎకరాలకు గ్రామంలోని రైతులకు 28 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారని, జిపిఓ బండారి రాజు గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో వింగ్ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా లక్షల రూపాయల్లో రైతుల ద్వారా డబ్బులను అక్రమంగా వసూలు చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. రికార్డులను పూర్తిగా తారుమారు చేస్తు రైతులకు నష్టం చేస్తున్నాడని, ప్రతిరోజు మున్సిపల్ వార్డు కార్యాలయం నుంచి తన విధులను నిర్వర్తించవలసి ఉన్న అక్కడి నుంచి తన కార్యకలాపాలను వెంచర్ల లో ఉన్న ఆఫీసుల ద్వారా తన విధులను నిర్వర్తిస్తుంటాడని ఆరోపించారు. గ్రామంలోని ప్రజానీకానికి ఎక్కడ అందుబాటులో ఉండడం లేదని అన్నారు. 113 సర్వే నెంబర్లో పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికి, ఎంజాయ్ మెంట్ పక్కా ఉన్న వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాయకుండా రైతులను మోసం చేస్తున్నాడని అన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవాళ్లుకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నాడని, అనేకమంది రైతుల వద్ద డబ్బులు డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్నారని, ఇట్టి విషయంలో అనేకమంది రైతులు భయాందోళనకు గురై జిపిఓ రాజుకు మధ్యవర్తుల ద్వారా లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారని, గతంలో అనేకసార్లు పై అధికారులకు విన్నవించడం జరిగిందని చెప్పారు. చిన్న కంజర్ల గ్రామ రైతులను పూర్తిగా నట్టేట ముంచుతు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న చిన్న కంజర్ల గ్రామ రెవెన్యూ అధికారి పైన పూర్తిస్థాయి విచారణ జరిపించి, వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, బాబురావు, నల్ల గండ్ల రాజు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

5 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

23 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

23 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago