మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలోని ఈ – క్లబ్ గురువారం ‘ స్టార్టప్ మేళా’ని ఉల్లాసంగా , ఉత్సాహంగా నిర్వహించింది . ఇప్పటికే ఉన్న సభ్యులను ప్రోత్సహించి , వారిలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడానికి , కొత్త వారిని ఆకర్షించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు . ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , మహోత్సవ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు . పర్యావరణవేత్త , చెట్ల పెంపం ప్రేమికుడు , జంతు సంరక్షణపై చాలా మక్కువ గల అవినాష్ నారాయణ స్వామితో శివాజీ ఆడిటోరియంలో ‘ ఎకో – చాట్ ‘ పేరిట ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు . సామాజిక ఆరోగ్యానికి ఆయన చేసిన కృషి , సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు . వారు అడిగిన పలు ప్రశ్నలకు సందర్భోచిత సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు .
ఐడియా పోస్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొని , పలువురి ప్రశంసలందుకున్నారు . సాంస్కృతిక ప్రదర్శనలు , వినోదభరితమైన స్కిట్లు ఆహుతులను ఉర్రూతలూగించాయి . ఫుడ్ , ఫ్యాషన్ స్టాళ్లు అన్నివేళలా క్రిక్కిరిసిపోయాయి . ఈ – క్లబ్ నూతన సభ్యులకు ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు . ఈ – క్లబ్ గురించి : విద్యార్థులలో వ్యవస్థాపక నెపుణ్యాలను పెంపొందించి , ఒక అభ్యాస – పనిచేసే వాతావరణం కల్పించేది ఈ – క్లబ్ . ఆయా కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ప్రాథమిక అవగాహన ఏర్పరచుకుని , వ్యవస్థాపకు లుగా ఎదగడానికి ఉపకరిస్తుంది . ఆయా రంగాల నిపుణులతో ముఖాముఖి ఏర్పాటు , ఆలోచనలకు పదునుపెట్టి ఓ రూపాన్నిచ్చేలా పోస్టర్ ప్రజెంటేషన్ , ఇతర క్లబ్లతో ఉమ్మడి కార్యక్రమాలు , వర్క్షాప్లను ఈ – క్లబ్ నిర్వహిస్తుంటుంది .
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…