మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ‘ సినిమాటిక్ డే ‘ ( రీల్ టు రియల్ ) ని విద్యార్థులు ఉత్సాహంగా , ఉల్లాసంగా నిర్వహించారు . భారతీయ సినిమా , ఫ్యాషన్ పోకడలపై దాని ప్రభావాన్ని ప్రతిబింబించేలా ‘ వస్త్రనోవా ‘ ( గీతం విద్యార్థి విభాగం ) దీనిని ఏర్పాటు చేసింది . ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే , చలనచిత్ర ప్రేమికుల మనస్సులకు ఇష్టమైన పాత్రను ధరించడం , లేదా అభినయించడం , లేదా తిరిగి సృష్టించిన దృశ్యాలను ఆస్వాదించడం . వాటికి ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జతచేసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం . దాదాపు ఆయా అంశాలన్నింటిలో గీతం విద్యార్థులు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు . ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు / యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తించి , వారిలో నిబిడీకృతంగా ఉన్న సాంస్కృతిక దృక్కోణాలను బహిర్గతం చేయడానికి తోడ్పడతాయని విద్యార్థి స్నేహిత్ అభిప్రాయపడ్డారు .
ఇటువంటి కార్యక్రమాల ద్వారా చిత్ర నిర్మాణ కళ , క్రాఫ్ట్ మొదలైన వాటిపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని మరో విద్యార్థి ప్రణవ్ పేర్కొన్నారు . గీతం విద్యార్థులలో అత్యధిక మంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడమే కాక , ఇతరుల ప్రదర్శనలను ఆస్వాదించారు . తమ ప్రతిస్పందనను కరతాళ ధ్వనుల రూపంలో మార్మోగించారు . వినూత్న వేడుక విద్యార్థుల ఉత్సుకతను మరింత పెంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…