సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలి
తక్షణం మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి
పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి
ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు , గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలి
పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శ జాన్ వెస్లీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే ఇక్కడికి రప్పించాలని,ఈ దుర్ఘటనపై సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలని, తక్షణం మృతుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈరోజు పాశం మైలారం ప్రాంతంలో పేలిన సిగాచి పరిశ్రమ ప్రాంతాన్ని సిపిఎం ప్రతినిధి బృందంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు.. గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. చికిత్స పొందుతూన్న కార్మికుల్లో కూడా అనేకమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు, కార్మికుల మృత్యువాతలు పడుతున్న ప్రభుత్వ అధికారులు కానీ, పరిశ్రమల యజమాన్యాలు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.
ఆసియా ఖండంలోనే పేరొందిన ఈ ప్రాంతంలో “మృత్యు ఘటన” అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవలని అన్నారు. పరిశ్రమల యజమాన్యము లాభార్జనే ధ్యేయంగా రియాక్టర్లు పెళయన్నారు. అన్‌స్కిల్డ్ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పని చేయించడం సరైంది కాదన్నారు. అన్‌స్కిల్డ్ వర్కర్లతో పని చేయించడం వల్లనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నాయకులు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…