నేడు పటాన్‌చెరు నియోజకవర్గ టియూడబ్ల్యూజే (ఐజేయు) సమావేశం

politics Telangana

 టియుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ సమావేశం ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి టియుడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గాన్ని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టు మిత్రులందరూ సమావేశానికి తప్పక హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశానికి టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏకె ఫైజల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆసిఫ్, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రెటరీ చెన్న బసవేశ్వర్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, జర్నలిస్టుల సమస్యలు, సంఘం బలోపేతం, నియోజకవర్గ స్థాయిలో కార్యవర్గ ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *