అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్‌చెరు లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 153 మంది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ప్రతి అంగన్వాడి ఉపాధ్యాయురాలికి మొబైల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జయరాం నాయక్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *