మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :
మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా ద్రోహిగా మరిందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మహిళా ఆగ్రహ యాత్ర , కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూమహిళలు, దళితులు, గిరిజనులు చట్టసభల్లో అడుగు పెట్టకుండా కాంగ్రెస్ దశాబ్దాలుగా అడ్డు పడుతోందన్నారు. మహిళలకు రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతో వారసత్వ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని తెలిపారు. ‘ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తుందన్న మహిళల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక తెలంగాణ మహిళల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి, మహిళా బిల్లును అడ్డుకొని పైశాచిక ఆనందం పొందిన విషయాన్ని మహిళా లోకం గమనిస్తోంది. అన్ని విధాల మహిళలను వంచిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మహిళామణులు తగిన బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదు అని గోదావరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ విజయలక్ష్మి, నాయకురాలు భవాని, రాణి తదితరులు ఉన్నారు.
