మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ :
సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న “సమర్థ-శిక్షణ శిబిరం”లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ ,యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.అనంతరం శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం, త్యాగం అనే విలువలపై నిలిచిన శక్తివంతమైన వేదిక అని పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, స్వాతంత్ర్య సమరం నుండి సామాజిక న్యాయం వరకు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.“కాంగ్రెస్ అంటే సేవ సేవ అంటే ప్రజల గెలుపు. ప్రజల పక్షాన పోరాటమే సేవాదళ్ ధర్మం” అని ఆయన పేర్కొన్నారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని బలపరచడం, ప్రతి కార్యకర్తను సేవా దిశగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ శిబిరం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ శిబిరం ద్వారా సేవాదళ్ కార్యకర్తలు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యలపై అవగాహన, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను అలవరుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే వేదికగా ఈ శిక్షణ శిబిరం నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి , శ్రీ సౌందర్య రాజన్ , ప్రణీత్,రత్నాచారి,సేవాదళ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిద్దెల జితేందర్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు మరియు మియాపూర్ యువనాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.
