ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
మే 10వ తేదీన పటాన్‌చెరు పీవీ నరసింహారావు ఆడిటోరియం కేంద్రంగా ఏర్పాటు చేసిన 10వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం పటాన్‌చెరులోని తన నివాసంలో కరాటే పోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కరాటే పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడ పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకులు రాజు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
