మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

politics Telangana

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠపన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

దేవాలయాలు సమాజంలో ఐక్యత మరియు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఉండాలని ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ అన్నారు. పటాన్‌చెరు జెపి కాలనీ డివిజన్ పరిధిలోని సాయి గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ స్థిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్నారు.ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ గ్రామాలు ఆధ్యాత్మికంగా వెల్లివిరిసినప్పుడే ప్రజల మధ్య సోదరభావం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలతో గ్రామలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాంరెడ్డి , మాజీ అధ్యక్షుడు సంతోష్ నాయక్ , శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్, నరేష్, సంతోష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *