సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
రాబోవు వార్షిక పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ జిపిఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎర్రగోల చంద్రశేఖర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను బస్వాపురం గ్రామానికి చెందిన ఎర్రగోల చంద్రశేఖర్ మిత్ర బృందం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎ లతో ఉత్తమ ఫలితాలు సాదించాలని, ఉన్నత చదువుల ద్వారనే ఉత్తమమైన జీవితాలు లభిస్తాయని, చదువులపై శ్రద్ధ వహించాలని, ఒత్తిడిని జయిస్తూనే అత్యుత్తమ జి.పి.ఎ లను లక్ష్యంగా చేసుకోవాలని, విధ్యార్థుల్లో మరింతి స్పూర్తి కలిగించి, ప్రోత్సహించడానికే అధ్యాపకులు కృషి చెయ్యాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నతమైన బాటలు వెయ్యడానికి మన ఊరు-మన బడి లాంటి కార్యక్రమలాతో విద్యరంగంలో ప్రైవేట్ విద్యసంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులపై మక్కువ చూపే విధంగా మరింత ముందుకు సాగలని తెలిపారు.అదేవిధంగా పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు జీవితంలో పైకి రాలేనని ఎటువంటి అగాయిత్యాలకు పాల్పడరాదని విద్యార్థులకు సూచించారు .పదవ తరగతి చదవని వారు కూడా సమాజంలో మంచి స్థితిలో ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ ఎర్రగొల్ల చంద్రశేఖర్, మధుమోహన్ ప్రశాంత్, సురేందర్ ఉపాధ్యాయ బృందం పాల్గొని విజయవంతం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…