Telangana

దేశభక్తి స్ఫూర్తితో గీతంలో 77వ గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం (26 జనవరి 2026న) గాంధీ కూడలిలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, దేశభక్తి స్ఫూర్తితో జరుపుకున్నారు. వందేమాతరం ఇతివృత్తంగా, ఆత్మనిర్బర్ భారత్ చొరవతో అనుసంధానించిన ఈ వేడుకలు, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య విలువలు, స్వావలంబన పట్ల జాతి నిబద్ధతను ప్రతిబింబించాయి.ఉదయం 9.00 గంటలకు గీతం హైదరాబాదు ఆదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ నిర్మాణంలో విద్యా సంస్థల కీలక పాత్రను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. సాంకేతికత, ఆవిష్కరణలు, నిరంతర శ్రేష్ఠత ద్వారా దేశ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు పోషించే కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తాము ఎంచుకున్న రంగాలలో ప్రపంచ స్థాయి ఫలితాలను సాధించడానికి దృష్టి కేంద్రీకరించి, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బందితో పాటు ఎన్ సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. గీతం విద్యార్థి విభాగాలైన కళాకృతి, అన్వేష క్లబ్బుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన బిహు నృత్యం ఆహూతులను అలరించాయి. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, భద్రతా సిబ్బందికి వారి అంకితభావ సేవకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.గీతం స్టూడెంట్ లైఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమం తేనేటి విందుతో ముగిసింది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారందరినీ ఐక్యంగా, దేశభక్తితో ఈ వేడుకలు ఏకం చేశాయి.

admin

Recent Posts

మియాపూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వైభవంగా గణతంత్ర వేడుకలు మనవార్తలు ప్రతినిధి , మియాపూర్‌: గణతంత్ర దినోత్సవం అనేది కేవలం…

3 hours ago

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఉత్పత్తులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

2 days ago

నైపుణ్యాభివృద్ధే భవితకు భరోసా

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పరిశ్రమ అవసరాలకు…

2 days ago

శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు

చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…

3 days ago

ఈవీ చార్జింగ్ స్టేషన్ల ద్వారా యువతకు ఉపాధి పటాన్‌చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…

3 days ago

బల్దియా అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…

3 days ago