యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వైభవంగా గణతంత్ర వేడుకలు
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్:
గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక జాతీయ వేడుక మాత్రమే కాదు అని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ అన్నారు .యలమంచి ఉదయ్ కిరణ్ నాయకత్వంలో మియాపూర్ మెయిన్ రోడ్ హేమ దుర్గా టెంపుల్ సమీపంలో, అలాగే రాఘవేంద్ర హోటల్ దగ్గర కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ హాజరయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, ప్రజాస్వామ్యం, లౌకికత, సమానత్వ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఆత్మను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే రోజు అని పేర్కొన్నారు. మియాపూర్ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. యువత, మహిళలు, కార్మికులు రాజకీయంగా చైతన్యం చెందాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, గిరి, గౌస్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, అశోక్ గౌడ్, విజయ్, మన్నెపల్లి నరేందర్, ప్రభాకర్, శంకర్, సుబ్బ రాయుడు, గోపినాథ్, వేణు, వీరభద్ర రావు, రాజు, నవీన్, గురువులు, వాసు, ప్రసాద్, నాని, రత్నాచారి, వంశీ, ప్రవీణ్, రాజేశ్, వినోద్, వినయ్, నాగ సాయి, రమేష్, గోపీ, వివేక్, సాయి, గోపాల్, సుభాష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, విద్యార్థులు, యువ నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం…
64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పరిశ్రమ అవసరాలకు…
చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…
భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…