రామచంద్రాపురం, మనవార్తలు :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లోని -శ్రీ పొట్టి శ్రీరాములు కళాభవన్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది , ఈ అవార్డుతో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ పై సామాజిక సేవలో మరింత బాధ్యత పెరిగిందని, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఇన్ని అవార్డులు రావడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందన్నారు. ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ చైర్మన్ ఆర్ కే రంజిత్ కు కంజర్ల కృష్ణమూర్తి చారి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…