Telangana

14వ గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు 14వ గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. చేతితో తయారు చేసిన 2,700 కాగితం బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు శివాలీ కుటుంబానికి వరంగా మారింది. ఏకంగా విశ్వ యవనికపై విజయకేతనం ఎగురవేయడానికి తోడ్పడింది. అదీ ఏదో ఒకటీ.. రెండూ.. కాదు, ఏకంగా 14 గిన్నిస్ రికార్డులు, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులతో పాటు నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు. హెదరాబాద్లోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్లు కలిగి ఉండడం కూడా మరో రికార్డుగా వినుతికెక్కడం విశేషం.ఇంతకు మునుపు, శివాలి కుటుంబం హ్యాండ్ మేడ్ పేపర్తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి మలి రికార్డు, 2,111 విభిన్న బొమ్మలు, 3,501 ఆరెగామి వేల్స్, 2,100 ఆరెగామి పెంగ్విన్స్, 6,132 ఆరెగామి సిట్రస్ (నిమ్మ తొన)లు, 6,100 ఆరెగామి వేల్స్, 2,500 ఆరెగామి పెంగ్విన్స్, 1,451 ఆరెగామి మాప్లీలు, 2,200 క్విల్లింగ్ డాల్స్, 9,200 ఆరెగామి ఫిష్, 1,993 ఆరెగామి మాప్లీ లీవ్స్లను ప్రదర్శనకు ఉంచి ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న విషయం విదితమే.మొత్తం 14 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు అభినందించారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

16 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

16 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

17 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago