Hyderabad

ప్రతి కాలనీనీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే జిఎంఆర్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…

అమీన్ పూర్:

అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రతి కాలనీలో సీసీ రోడ్డు, వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నితీశా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago