_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి పటాన్చెరు వరకు భారీ ఫ్రీడం రన్
_స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ది సప్తహ కార్యక్రమాల్లో భాగంగా గురువారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం నుండి పటాన్ చెరు వరకు భారీ ఫ్రీడం రన్ నిర్వహించారు.ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, జిఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేత బూని బోలో భారత్ మాతాకీ జై అంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ర్యాలీ సాగింది.గురువారం ఉదయం 8 గంటలకు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని సంగీత థియేటర్ వద్ద ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ఫ్రీడం రన్ ప్రారంభించారు. ఇక్రిసాట్ మీదుగా పటాన్ చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 75 ఏళ్ల వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు వారాలపాటు నియోజకవర్గంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. సంబంధ వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి , డీఎస్పీ భీమ్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి ప్రసాద్, తహసిల్దార్లు శివకుమార్, మహిపాల్ రెడ్డి, ఎంపీడీవోలు మల్లేశ్వర్, బన్సీలాల్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మండల విద్యాధికారులు రాథోడ్, జెమినీ కుమారి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పరమేష్, అఫ్జల్, పృథ్వీరాజ్, గోవింద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…