Telangana

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

-మార్గదర్శనం చేసిన వక్తల ప్రసంగాలు

-విజేతలకు బహుమతుల ప్రదానం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ లో బుధవారం ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం- 2024 – ఘనంగా నిర్వహించారు. ‘ప్రపంచ అవసరాలను తీరుస్తున్న ఫార్మసిస్టులు’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొని ఫార్మా రంగ అభివృద్ధి. విస్తరణ, ఉపాధి అవకాశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని ఔషధ నియంత్ర మండలి (ఇండియా) డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఎం.రాంకిషన్ మాట్లాడుతూ, ఔషధ నియంత్రణ మండలి విధులు, పాత్ర, ఔత్సాహిక ఫార్మసిస్టులకు ప్రభుత్వ శాఖలలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఔషధ భద్రత, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేయడంలో ఫార్మసిస్టుల కీలక పాత్రను నొక్కి చెప్పారు.ఆత్మీయ అతిథిగా పాల్గొన్న బొటానిక్ హెల్త్ కేర్ డైరెక్టర్, పరిశోధనా విభాగాధిపతి డాక్టర్ హెచ్.ఎన్. శివప్రసాద్, నివారణ ఆరోగ్య సంరక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వివరించారు,

మనదేశంలో న్యూట్రాస్యూటికల్స్ పెరుగుదల, ఆ రంగ అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు, ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలలో మన సహజ సిద్ధ ఔషధాలకు పెరుగుతున్న మార్కెట్ ను వివరించారు. ఔత్సాహికులు క్లినికల్ పరిశోధన లేదా న్యూట్రాస్యూటికల్స్ వంటి రంగాలలో సొంత కంపెనీలను స్థాపించవచ్చంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు.మరో ఆత్మీయ అతిథి, కేర్ టీఆర్యూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ ప్రియాంక దాస్, రోగి భద్రత, రక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఫార్మకోనిజిలెన్స్, ఫార్మా పరిశ్రమలో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్. వినియోగంతో పాటు ఆ రంగంలోని డ్రగ్ సిఫ్టీ అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, పీవీ కంప్లియన్స్ మేనేజర్, అగ్రిగేట్ రిపోర్ట్ రెట్టర్ వంటి పలు కెరీర్ అవకాశాలను ఆమె ఉటంకించారు. తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించారు. ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల క్రియాశీల పాత్రను వివరించారు.

ఈ సందర్భంగా ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీ ‘జీ- ఫార్మా నెక్సస్’ పేరుతో రూపొందించిన తొలి పత్రికను ఆవిష్కరించారు. ఇది ఫార్మసీ స్కూల్ ఎదుగుదలకు తోడ్పడమే గాక, విస్తరణ ప్రయత్నాలకు ఉపకరిస్తుందన్నారు.ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, గోడ పత్రికల రూపకల్పన, క్విజ్, మౌఖిక ప్రదర్శన వంటి పలు పోటీల విజేతలకు బహుమతుల పంపిణీతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago