పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాలలోని పాలనపై డిజిటల్ ఇండియా ప్రభావం, తెలంగాణలో అన్వేషణాత్మక అధ్యయనం అనే అంశంపై గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ఒకరోజు కార్యశాలను నిర్వహించినట్టు ప్రాజెక్టు డెరైక్టర్, గీతం అధ్యాపకుడు డాక్టర్ గుర్రం అశోక్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సౌజన్యంతో దీనిని నిర్వహించినట్టు తెలిపారు.పాలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎసోచ్ఎస్) డీన్ ప్రొఫెసర్ కామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని, అట్టడుగు స్థాయిలో డిజిటల్ ఇండియా విధాన పరిశోధన అవశ్యకతను నొక్కిచెప్పారన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీఎహెచ్ఎస్ డెరైక్టర్ సన్నీ జోస్ వర్కుషాప్ కు హాజరైన అతిథులను స్వాగతించినట్టు తెలిపారు.అట్టడుగు వర్గాలను సాధికారపరచడంలో డిజిటల్ ఇండియా యొక్క సామర్థ్యాన్ని మౌలానా అబుల్ కలాం ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నిషినికాంత్ కోల్గే ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు ఇటువంటి కార్యక్రమాలకు మహాత్మా గాంధీ మద్దతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు. గ్రామీణ తెలంగాణాలో లింగ భేదం, డిజిటల్ టెక్నాలజీలపై హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ షీలా సూర్యనారాయణన్ లోతెన అవగాహన కల్పించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రాజెక్టు డైరెక్టర్ హోదాలో తాను పరిశోధనా ఫలితాలను, అధ్యయనం సిఫారసులను సమర్పించగా, వాటిపై చర్చకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్ భీమేశ్వర్రెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి చిట్టేడి రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించినట్టు తెలియజేశారు. దీనికి అదనంగా నలుగురు ప్రతివాదులు, క్షేత్రస్థాయి పరిశీలకులు ఈ కార్యశాలలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నట్టు వెల్లడించారు. గీతం ఆధ్యాపకులు, విద్యార్థులు పలువురు ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని విజయవంతం చేసినట్టు తెలిపారు.