పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం: మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్/కృత్రిమ మేథ పాఠ్యాంశాల’పై రెండు రోజల కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, మెకానికల్ ఇంజనీరింగ్ నెపుణ్యం-ఆధారిత విద్యను రూపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి మార్గదర్శకత్వంలో, ప్రఖ్యాత పరిశోధనా సంస్థల నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నట్టు తెలియజేశారు. సూరత్కల్లోని ఎన్ఐటీకే నుంచి ప్రొఫెసర్ ఎస్.ఎం. మురుగేంద్రప్ప, ఐఐటీ హెదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఆర్.ప్రశాంత కుమార్, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ వి.వాసు తదితరులు పాల్గొని తమ విలువెన అవగాహనను పంచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, కృత్రిమ మేథ, వినూత్న విధానాల అన్వేషణకు ఈ కార్యశాల ఒక వేదికగా ఉపయోగపడిందన్నారు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు చురుకుగా పాల్గొని, పరిశ్రమ డిమాండుకు తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో తోడ్పాటును అందించినట్టు తెలిపారు. గీతం మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు కూడా ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని, ప్రతిపాదిత పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి వారి అభిప్రాయాలు, తగు సూచనలను అందించినట్టు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించేలా, విద్యార్థులకు సమగ్రమెన్ష, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు కీలక భూమిక పోషించినట్టు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…