పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైదరాబాద్ ( జీఎస్బీ ) ; నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్ఎస్ఈ ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 26-27 తేదీలలో ‘ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫెన్షన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్ ‘ రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ . రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . సెక్యూరిటీ మార్కెట్లలో పార్టిసిపెంట్ల నెపుణ్యాలు , సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్షాప్ లక్ష్యమన్నారు . ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు , వారిని నిజ – సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు . సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం . అరవింద్ , క్యాపిటల్ మార్కెట్లోని ఎస్ఎంఈ ఎల్.కన్నన్ , గీతం అధ్యాపకులు తమ విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు . ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు కోసం ఈనెల 24 వ తేదీలోగా డాక్టర్ ఎన్ . రూపలత 98481 17823 ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…