* మెరుగైన సమాజ స్థాపనలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం
* విశ్వభారతి లా కాలేజ్ కరస్పాండెంట్ రవి అనంత
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గొప్ప విజయాలు సాధించే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయని, వాటిని ఓపికగా అధిగమిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని విశ్వభారతి లా కాలేజ్ కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో ఆటుపోట్లు సహజమన్నారు. శత్రువులు సృష్టించే అడ్డంకులను విజయ సోపానాలుగా మార్చుకొని ముందడుగు వేయాలన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగిలోని విశ్వభారతి లా కాలేజ్ లో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రవి అనంత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఓటమికి కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన వారే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మెరుగైన సమాజ స్థాపనలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉన్నవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి తమ కళాశాలలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత పతకాలను అందించాలని నిర్ణయించామన్నారు. తమ తల్లి స్మారకార్థం విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ పతకాలను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. చదువుతోనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని, ఫ్యాకల్టీ సభ్యులు తేజశ్రీ, అన్వీ, కీర్తి, రమ్యశ్రీ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు
జూనియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ ఫ్రెషర్స్ పార్టీ ఆద్యంత ఉత్సాహంగా సాగింది. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు. ఆసక్తికరంగా సాగిన గేమ్స్ లోనూ విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…