Telangana

కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తా: నీలం మధు ముదిరాజ్

_అన్న మీ వెంటే మా పయనం..

_ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే..

_నీలం కు భరోసా ఇచ్చిన అనుచర గణం.

_వేలాదిగా తరలివచ్చిన అభిమానులు

_పటాన్ చెరు టికెట్ కోసం అధిష్టానం పునరాలోచించాలి..

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

నీలం మధు కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీ అర్ ఎస్ టికెట్ నీలం మదుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా పయనం అంటూ, నిరంతరం ప్రజలలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాన నాయకుడు నీలం మధు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే కు పోటీ చేయాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. తామంతా స్వచ్చందంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ఇంటింటికి తిరిగి గెలిపించుకుంటామని తేల్చి చెప్పారు.
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఎన్ఎంఅర్ యువసేన కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ విస్తృత స్థాయి సమావేశానికి అభిమానులు, సబ్బండ వర్గాల మద్దతు దారులు వేల సంఖ్యలో హాజరయ్యారు.

సభా ప్రాంగణంలో మొదట చంద్రయాన్ 3 విజయం సాధించిన సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. నీలం మధు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని తన వంతుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ పిఎసిఎస్ చైర్మన్ నారాయణరెడ్డి కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించారు. కులమత బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు కదలి నీలం మధుకు అండగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లావ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టామని అది ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఎక్కడికి వెళ్లినా మధు అన్నకు మద్దతిస్తూ గెలిపించుకుంటామని తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు.
త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరి సహకారంతో ముందుకు సాగుతామన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎప్పుడూ వదులుకో బోరని అ ధీమాతోనే ముందుకు వెళుతున్నానని వెల్లడించారు. ప్రజల మనిషిగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సహకారంతోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

కార్యకర్తల అభిమానుల నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణలో అందర భాగస్వామ్యం కల్పించి వారి నిర్ణయం మేరకే త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ప్రజల మనిషిగా వారు ఏది కోరుకున్న అదే రీతిలో ముందుకు సాగేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరూ గుర్తించారని రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం దారుణమన్నారు. గత నాలుగేళ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ, ప్రజలకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు టికెట్ విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తాను పార్టీకి అందించిన సేవలకు ఎమ్మెల్యే టికెట్ అడిగే హక్కు తనకు ఉందన్నారు.తనకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, రాష్ట్ర బీసీ నాయకులు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన వాలంటీర్లు ఏర్పాటు చేసుకుని గెలుపే దిశగా ముందుకు సాగుతామని ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. బీసీల సత్తా చూపే విధంగా సీటు గెలిపించుకుని చూపిస్తామని తెలిపారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాల ప్రజలు నా సేవలను గుర్తించామని తెలుపుతూ స్వయంగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని చెబుతున్నారని తెలిపారు. ఇంతటి అభిమానం చూపిస్తున్న మీ అభిమానం వెలకట్టలేనిదన్నారు. బీసీ బిడ్డగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్బండవర్గాలైన ముదిరాజ్ సంఘం, రజక సంఘం, పద్మశాలి సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం, లింగాయత్ సంఘం, వడ్డెర సంఘం, ముస్లిం మైనార్టీ సోదరులు, రెడ్డి సంఘం,మహిళలు, ఇతర కుల సంఘాల ప్రతినిధులు, ఎన్ఎంఆర్ యువసేన నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago