Telangana

కక్ష్యపూరిత రాజకీయాలకు తెరదించుతాం నీలం మధు ముదిరాజ్

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ 

ఈడీ ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న మోదీ

నేషనల్ హేరాల్డ్ కేసులో సోనియా,రాహుల్ పై ఈడి చార్జిషీట్ అన్యాయం

ప్రజాక్షేత్రంలో బీజేపీ సంగతి తేల్చుతాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడి కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీల తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఈడి ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అడ్డగోలుగా బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ వ్యాపారస్తులకు మద్దతునిస్తూ వారిని దేశం దాటిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను నిండా ముంచుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకుల పై తప్పుడు కేసులు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుల పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago