సమస్యలపై నిరంతరం పోరాడుతాం టిడబ్ల్యూజెయఫ్ కార్యదర్శి కొత్తకొండ సత్యం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

జర్నలిస్టుల సమస్యలపై యూనియన్లకు అతీతంగా నిరంతరం పోరాడతామని పటాన్ చెరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి కొత్తకొండ సత్యం అన్నారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు ఇటీవల పటాన్ చెరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభలో కార్యదర్శిగా తిరిగి కొత్తకొండ సత్యం ఎన్నికైన సందర్భంగా వారికి శాలువాతో ఘనంగా సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ.. మా యొక్క ఫెడరేషన్ సంఘంపై అభిమానంతో మమ్మల్ని సత్కరించిన జర్నలిస్టులకు పటాన్ చెరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గౌడ్, మహేష్ గౌడ్, విజయ్, జింకల శ్రీనివాస్, మున్నీ శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *