– నేడు పటాన్‌చెరులో టీయూడబ్ల్యూజే–ఐజేయూ సమావేశం
– సంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ సమావేశం ఆగస్టు 11న ఉదయం 11 గంటలకు రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలపై సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి టీయూడబ్ల్యూజే–ఐజేయూ కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కె. ఫైజల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు అబ్దుల్ బాసిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆసిఫ్, జనరల్ సెక్రటరీ చెన్న బసవేశ్వర్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…