సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం..

Hyderabad politics Telangana

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. నీలం మధు తల్లిదండ్రులు స్వర్గీయ నీలం నిర్మల్, నీలం రాధా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రారంభించారు.

గ్రామ సభ…..

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముది రాజ్ అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా పాలన చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచన కనుగుణంగా సమిష్టి నిర్ణయాలతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు

జ్యూట్ బ్యాగుల శిక్షణ కేంద్రం ప్రారంభం…

చిట్కుల్ గ్రామంలోని మహిళా గ్రామైక్య సంఘం భవనంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సౌజన్యంతో మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీ కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారం సర్పంచ్ నీలం మధు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 మంది మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగుల బదులు జ్యూట్ బ్యాగులను వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం మానవ మనుగడకు ప్రమాదకరమన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ప్రతి ఒక్కరు జ్యూట్ బ్యాగులను వాడాలని ఆయన సూచించారు. ఈ మేరకు పంచాయతీలో తీర్మానం కూడా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, ఎంపిటిసి మంజుల, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేష్, కృష్ణ, గౌరీ, భుజంగం, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, గ్రేషియా జ్యుట్ క్రియేషన్స్ అధినేత్రి స్వర్ణ, మహిళా సంఘం అధ్యక్షురాలు మనీలా, సీసీ లక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ విగ్రహానికి శంకుస్థాపన….

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం శనివారం చిట్కూల్ గ్రామ పరిధిలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయలతో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.చాకలి వెంకటేశం. చాకలి కృష్ణ చాకలి సత్యనారాయణ. చాకలి యాదయ్య. చాకలి కుమార్. పాల్గొన్నారు.🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *