వడ్డే ఓభన్న స్ఫూర్తి ఆదర్శనీయం_ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్టయ్య

politics Telangana

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

వడ్డే ఓభన్న పోరాటం మరువలేనిదని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్టయ్యఅన్నారు రామచంద్రపురం వడ్డెర బస్తీలో వడ్డే ఓభన్న 180వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని ,ఒడ్డే ఓభన్న పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయడంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. వడ్డెర సమాజానికి చెందిన వీరుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వడ్డే ఓభన్న ధైర్యం, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరీకుప్పల లింగయ్య, వడ్డెర సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎట్టయ్య, సిద్దయ్యా, పెద్దులు, సత్తయ్య, మురళి, యాదయ్య, మల్లయ్య, సైదులు, వీరయ్య, కుల సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *