రామచంద్రపురం:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు.
రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో పట్టణాన్ని మరింతగా అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగిందన్నారు.కాలనీల వారీగా అధికారులను నియమించామన్నారు..
రేపటి నుండి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి బస్తిల్లలో,కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం,డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి కోరారు.
భారతీ నగర్ పరిధిలో ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారురోడ్లు ,డ్రైనేజీ, నాలాలు ఇతర సమస్యలు ఉంటే పట్టణ ప్రగతి కార్యక్రమంలో అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…