మనవార్తలు ,శేరిలింగంపల్లి:
ఈ నెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మియపూర్ నరేం గార్డెన్ లో నిర్వహిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశానికి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైకు ర్యాలీగా బయలు దేరారు . అనంతరం మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న, మన ముఖ్యమంత్రి తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమ స్థానం నుంచి రాజకీయ పార్టీగా మార్చిన ఘనుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ అని మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక యువజన టీఆరెఎస్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్,మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.