Districts

ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

పటాన్ చెరు

దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.

నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులు సర్పంచ్ నీలం మధు కోలాటం ఆడి, నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అందంగా తీర్చిదిద్దిన వాహనంలో డప్పుల చప్పుళ్లు, యువత కేరింతలు, ఆటపాటల మధ్య చిట్కుల్ గ్రామంలోని చెరువుకు తరలించి వైభవంగా అమ్మవారి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, వార్డు సభ్యులు ‘ఎన్ఎంఎం’ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

19 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago