_ప్రచారానికి తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
మనవార్తలు ,పటాన్ చెరు:
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డు ఇన్చార్జిగా ఎమ్మెల్యే జిఎంఆర్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 25 మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల బృందంతో కలిసి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే జిఎంఆర్ బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించడంతో పాటు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చేశారు. అనంతరం మునుగోడు లోని ఒకటో వార్డు, 13వ వార్డులో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం ప్రచారం నిర్వహించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…