Telangana

కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ముత్తంగి డివిజన్ పరిధిలోని న్యూ టౌన్, డి ఎన్ కాలనీలలో పర్యటన

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలు ఏర్పడినప్పుడు నిర్మించిన సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని.. వెంటనే వాటిని ఆధునికరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సీసీ రోడ్లు, యుజిడిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  వెంటనే నిధులు మంజూరు చేస్తామని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి పరిధిలోని ప్రతి కాలనీలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు సిల్వెరి శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, కుమార్ గౌడ్, మేరాజ్ ఖాన్, కిట్టు, సందీప్, రామకృష్ణ, అబేద్, యాదగిరి, బాబుల్ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

16 hours ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

16 hours ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

2 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

2 days ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

2 days ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

2 days ago