పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో సోమవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పడిపూజ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయకుడు విజయ్ ఏసుదాసు బృందం చే భజన గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వాములు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…