పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములును, రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు సర్పంచ్ ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు మరువలేనివిగా నిలిచయాన్నారు. సత్తయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామపంచాయతీ, అనంతరం జిహెచ్ఎంసి పరిధిలో నిరంతరం శ్రమించి, పట్టణ శుభ్రత, మౌలిక వసతుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. రాములు నీటిపారుదల శాఖలో పనిచేసే సమయంలో పట్టణ ప్రజలకు నిరంతర నీరు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.పట్టణంలో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తినా, త్వరితగత పరిష్కారం చేసేవారన్నారు. ప్రజా సేవకు ఎనలేని కృషి చేసి, ఒక తల్లి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, అలాగే అప్పటి గ్రామపంచాయతీ మరియు జిహెచ్ఎంసి ఉద్యోగులు పట్టణాన్ని ప్రేమగా చూసుకుంటున్నారని కొనియాడారు. వీరి సేవలను గుర్తిస్తూ, సేవా ధృక్పథం కలిగిన ఉద్యోగులు ఎల్లప్పుడూ గుర్తించబడతారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతర జీవితం ప్రశాంతంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…