తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని బుధవారం ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రంగోలి, కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల ఎం డి ఆర్ ఫౌండేషన్ ను అభినందించారు. తన బాల్యంలో సంక్రాంతి వచ్చిందంటే పండగ ముందు పండగ తర్వాత గాలిపటాలు ఎగురవేస్తూ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వారమని నేటితరం సెల్ ఫోన్, సోషల్ మీడియా మాయలో పడి మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పృథ్వీరాజ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…