గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాబోయే మూడు దశాబ్దాలు వెక్టర్ డేటాబేస్ లకు చెందుతాయని, అభివృద్ధి చెందుతున్న డేటా ప్రపంచంలో అందుకు అనుగుణంగా ఉండటానికి గణితంపై పట్టు సాధించాలని హైదరాబాదు విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో డేటా సైన్స్ పాత్ర’ అనే అంశంపై బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ప్రొఫెసర్ రావు సైన్స్ యొక్క సారాంశం, గణితం యొక్క పాత్ర, డేటా ఆధారిత సమస్య పరిష్కారానికి పెరుగుతున్న ఔచిత్యం గురించి ఆలోచించమని విద్యార్థులను ప్రేరేపించారు. ‘అవసరం ఆవిష్కరణకు తల్లి’ అని చెబుతూ, ట్రాఫిక్ అంచనాలు, మౌలిక సదుపాయాల ప్రణాళిక, నిర్ణయం తీసుకోవడం వంటి సంక్లిష్ట సవాళ్లను గణిత మోడలింగ్, డేటా సైన్స్ ఎలా పరిష్కరించగలవో ఆయన వివరించారు.
శాస్త్రీయ నమూనాల పరిణామం, అంతర్ విభాగ నైపుణ్యాల ప్రాముఖ్యత, డేటా విశ్లేషణలో గణిత కఠినత యొక్క ఆవశ్యకత గురించి ప్రొఫెసర్ రావు చర్చించారు. డేటా శాస్త్రవేత్తలకు అవసరమైన నైపుణ్యాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఓపెన్-మైండెడ్ నెస్, మోడలింగ్, కమ్యూనికేషన్, విజువలైజేషన్, ఆఫ్టిమైజేషన్ పద్ధతుల విలువను వివరించారు.వాస్తవ ప్రపంచ సవాళ్లు, విశ్లేషణాత్మక పరిష్కారాల మధ్య వారధిగా గణిత నమూనా తయారీ యొక్క ప్రాముఖ్యతను ప్రొఫెసర్ రావు నొక్కి చెప్పారు.
పరిశోధనా ఫలితాలలో ధ్రువీకరణ, స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రాబోయే మూడు దశాబ్దాలు వెక్టర్ డేటాబేస్ లదే అని పునరుద్ఘాటించారు.ఎం.ఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులు చిన్న పరిశోధన ప్రాజెక్టులను చేపట్టాలని, ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు అవకాశాలను గుర్తించడానికి భారతదేశం యొక్క విజన్ డాక్యుమెంటు 2047ను అధ్యయనం చేయాలని ఆయన ప్రోత్సహించారు.తొలుత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి అతిథిని స్వాగతించగా, ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు, డాక్టర్ జాదవ్ గణేష్ ప్రొఫెసర్ రాఘవేంద్రరావును సత్కరించారు.
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత,…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్…