Hyderabad

అట్టహాసంగా ఆరంభమైన జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నీ

మనవార్తలు,హైదరాబాద్:

హైదరాబాద్‌ మరో జాతీయస్థాయి టోర్నీకి వేదికైంది. స్థానిక సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా జాతీయ 50వ మహిళల సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొత్తం 32 జట్లు పోటీపడుతున్న టోర్నీ వచ్చే నెల 3 తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడలేని విధంగా త్వరలో అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి వివరించారు. జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హ్యాండ్‌బాల్‌ టోర్నీని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రిపుల్‌ ఒలింపియన్‌ ముకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పోటీల తొలి రోజు బరిలోకి దిగిన తెలంగాణ 27-12 తేడాతో పుదుచ్చేరిపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 17-4 ఆధిక్యం కనబరిచిన తెలంగాణ..అదే జోరుతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

admin

Recent Posts

మార్చి 13న పటాన్‌చెరులో  ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు

27 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని వచ్చే…

2 hours ago

ముందుగా మనం భారతీయులం

గీతం ఫెస్ట్ లో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మనం ఏ ప్రాంతం,…

3 hours ago

ఏఐతో నైపుణ్యాభివృద్ధి, కొత్త అవకాశాలకు బాటలు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సైయంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్రో మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కృత్రిమ మేధస్సు…

3 hours ago

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

17 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

17 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

17 hours ago