Telangana

లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద దాడి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి అని సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కేవరాజయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం మండలములోని ఐడిఏ పాశమైలారంలోని సీనర్జీ, పార్లే, వ్యాగువాల్స్ తదితర పరిశ్రమలలో 12న జరిగే సమ్మె సందర్భంగా గేటు మీటింగ్ లు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పై కార్మికులు ,కూలీలు, రైతులు తెగించి పోరాడుతున్నారని మోడీ ప్రభుత్వం మీద ఉద్యమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. వాటితో కార్మిక వర్గానికి తీవ్రం నష్టమని, తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మిక సంఘాల పట్ల చులకన చూడడం కార్మిక సంఘాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి అనడం సరికాదన్నారు. కార్మికులు, కర్షకుల శ్రమ లేనిదే సంపద అభివృద్ధి లేదని అన్నారు. లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే వాటిని అమలు చేయకుండా కార్మికులను యాజమాన్యాలు తీవ్రమైన శ్రమదోపిడికి పాల్పడ్డాయని విమర్శించారు. లేబర్ కోడ్స్ తో మరింత శ్రమ దోపిడిని యాజమాన్యాలు పాల్పడడానికి అవకాశం దొరికిందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో పాటు రైతు కూలీ ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, అందులో భాగంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని ఈ సందులో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పరిశ్రమ నాయకులు శాంత కుమార్, హరినాథ్, శంకర్, రాజు, అబ్దుల్ ఆఫీ జే , దేవిడి రాజు, శ్రీనివాస్, సంతోష్ కుమార్ గౌడ్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago