Telangana

పెంచిన కనీస వేతనాలను వెంటనే అన్ని పరిశ్రమంలో అమలు చేయాలి

జూన్ వేతనంతో కలిపి ఇవ్వాలి

అమలు చేయని పరిశ్రమల వద్ద ఆందోళన

సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే అన్ని పరిశ్రమలలో అమలు చేయాలని, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము జూన్ నెల నుంచి అమలు చేయాలని జీవోలో స్పష్టంగా చెప్పిందని, జులైలో ఇచ్చే వేతనంలో కంపల్సరీ అన్ని పరిశ్రమల యజమానులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని పరిశ్రమలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. చాలా రోజుల నుంచి వేతనాలు పెరగలేదని, సిఐటియు అనేక సంవత్సరాల నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు, ఈ వేతనాలను కూడా ఆయా పరిశ్రమలో నిర్దిష్టంగా కేటగిరి వారిగా, వాళ్లకు వర్తించే కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు మిగతా కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు, అమలు చేయని యజమాన్యాల మెడలు వంచుతామన్నారు. గత 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలను పెంచలేదని, పెంచిన తర్వాత కూడా కాలయాపన చేయడం నిర్లక్ష్యం చేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వము స్కిల్, సెమి స్కిల్, ఆన్ సీల్డ్, హై స్కిల్డ్ విభజించిందని, అనేక చోట్ల పరిశ్రమలలో ఆన్ స్కిల్డ్ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఐటీఐ ,డిప్లమాలు , 10 సంవత్సరాల నుంచి పని చేసే వాళ్ళందరూ ఉన్నారని, వీరికి ఆన్ స్కిల్డ్ ఎలా వర్తిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని, అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్ ,మున్సిపాలిటీలు, అర్బన్ అని కేటగిరీలు గా విభజించిందన్నారు. కాబట్టి పరిశ్రమల యజమాన్యాలు వారికి వర్తించే క్యాటగిరిలో ప్రాంతాలవారీగా అమలు చేయాలని ఏమాత్రం కాలసత్వం గాని తేడాగా వచ్చిన కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాలను హెచ్చరించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago