Districts

దేశంలోనే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ – చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్‌చెరు:

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హనుమంతుని గుడి లేని గ్రామం, సంక్షేమ పథకాలు అందని ఇల్లులేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారని అందుకే ఆయన దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడని చిట్కుల్ గ్రామ సర్పంచ్ మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మూడు రోజుల పండగగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎంఎం యువసేన, తెరాస నాయకులు కలిసి రుద్రారం గణేష్ దేవస్థానం వరకు గురువారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గణేష్ దేవస్థానం లో ముఖ్యమంత్రి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని దీనికి మద్దతుగా పాదయాత్రలో కొంతదూరం పాల్గొని ప్రోత్సహించారని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. వృద్ధులకు ఆసరా పింఛన్, ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మీ, మైనారిటీ లకు షాదీ ముబారక్, రైతులకు రైతుబంధు, బీమా, 24 గంటల కరెంటు ఇలాంటి పథకాలు అందిస్తున్నారని ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వచ్చాక సర్పంచులు చేసిన అభివృద్ధి ఎప్పటికీ చెప్పుకునేలా ఉందని ఆయన తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ థామాలు, నర్సరీలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో శ్రీకారం చుట్టి గ్రామీణాభివృద్ధికి చేయూత నందించారన్నారు. కేసీఆర్ మాస్కులు ధరించి, పెద్ద తెరాస జెండాలతో, టపాసులతో పాదయాత్ర ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి, చిట్కుల్ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, పాండు, వెంకటేష్, క్రిష్ణ, వెంకటేష్, భుజంగం, మురళీయాదవ్, రాజ్ కుమార్, ఆంజనేయులు, పీఏసీఎస్ ఛైర్మన్ నారాయణరెడ్డి, రైతుసమన్వయకమిటీ గ్రామ అధ్యక్షుడు వి‌.నారాయణరెడ్డి, తెరాస గ్రామ ప్రెసిడెంట్ ప్రశాంత్, నరేష్, రాజు, అనిల్, విష్ణు, శ్రీను, ఎన్ఎంఎం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago