_ఎన్ని రోజులు బతికామని కాదు..ఏమీ చేశాం అన్నదే ప్రధానం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_రెండు కోట్ల 25 లక్షల రూపాయల విరాళం అందించిన జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్
మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరులో జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో రెండు కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలు తమ వివాహాది శుభకార్యాలను అతి తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పటాన్ చెరు పట్టణంలో పేద ప్రజల కోసం ఏడు ఫంక్షన్ హాళ్లు నిర్మించామని తెలిపారు.
మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తికి అనుగుణంగా ఎన్ని రోజులు బతికామన్నది కాకుండా బతికినన్ని రోజులు ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి నిమిత్తం వేలమంది ప్రజలు జీవనం సాగిస్తున్నారని, వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటికలకు స్థలం సరిపోవడం లేదని, త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ఐనోల్ గ్రామ సమీపంలో రెసిడెన్షియల్ హబ్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలను విశ్వసించ వద్దని, ప్రతిక్షణం ప్రజాహితం కోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ,ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయ్ భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్,డిఎస్పి భీమ్ రెడ్డి, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి,మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, వాజీధ్ అలీ, భారీ సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…