వికలాంగులను చైతన్యపరిచే విధంగా ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయం

politics Telangana

గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ

ఎన్ పి అర్ డి క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

వికలాంగులను చైతన్యపరిచే విధంగా ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయమని గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ అన్నారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ ను గురువారం గీతం యూనివర్సిటి ప్రాంగణంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మాణిక్ లతో కలిసి గీతం యూనివర్సిటీ రెసిడెంట్ డైరెక్టర్ డివివివి వర్మ క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వర్మ మాట్లాడుతూ వికలాంగులు అంగవైకల్యం ఉందని అధైర్యపడకుండా ముందుకు వెళ్లాలని తెలిపారు. వికలాంగులలో అత్యుత్తమ ప్రతిభ ఉంటుందని, దాన్ని బయటకు తీసేందుకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజంలో అంగవైకల్యం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్, లూయిస్ బ్రెయిలి, స్టిఫెన్ హాకింగ్ అనేక విజయాలు సాధించరాని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు.చదువుకోవడం ద్వారానే వికలాంగులకు సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తాయని అన్నారు. గీతం యూనివర్సిటీ అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, గీతం యూనివర్సిటీ భవనలాన్ని వికలాంగులు వినియోగించుకునే విదంగా మార్చడం జరిగిందని అన్నారు.అంగవైకల్యం ఉన్నప్పటికీ అనేక మంది గొప్ప గొప్ప విజయాలు సాధించారనే విషయాన్నీ గుర్తించాలని అన్నారు.

వికలాంగులు చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో వికలాంగులకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వాలు కల్పిస్తున్న కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వికలాంగులు కృషి చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు.సమాజంలో చదువుకు మించిన ఆయుధం మరొక్కటి లేదనే విషయాన్నీ వికలాంగులు గుర్తించాలన్నారు.వికలాంగుల సమస్యలపై పోరాడుతూనే,చట్టాలు, సంక్షేమ పథకాలపై వికలాంగులను చైతన్యం తీసుకురావడానికి ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అయన ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *